కన్నప్ప.. షూట్ పూర్తి చేసుకున్న అక్షయ్‌ కుమార్‌

Akshay Kumar Completes His Shooting Part For Kannappa

టాలీవుడ్ హీరో విష్ణు మంచు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఒకప్పటి బ్లాక్ బస్టర్ ‘భక్త కన్నప్ప’ సినిమాను రీమేక్ చేయాలనే విష్ణు కోరిక మేరకు ఇది రూపొందుతోంది. ఈ చిత్రానికి ‘మహాభారతం’ సీరియల్ ఫేమ్ ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పలు సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ నటీనటులు  నటిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‍తో పాటు లేడీ సూపర్ స్టార్ నయనతార, మలయాళ స్టార్ నటులు మోహన్ లాల్, ప్రీతి ముకుందన్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌ కూడా ఇందులో ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన న్యూజిలాండ్‌లో జరుగుతున్న కన్నప్ప షూటింగ్‌లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

అదేంటంటే..? అక్షయ్‌ కుమార్‌ ఈ సినిమాలో తన పార్ధుకి సంబంధించిన షూటింగ్‌ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్‌తో కలిసి పని చేసిన ఎక్స్‌పీరియెన్స్ గురించి విష్ణు మంచు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. “అక్షయ్‌ కుమార్‌ గారితో కలిసి వర్క్ చేయడం ఎంతో బావుంది. షూటింగ్ సమయంలో ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆయనతో గడిపిన క్షణాలు అద్భుతం. ప్రస్తుతానికి ఈ ప్రయాణం ముగిసినా.. మున్ముందు ఆయనతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను” అని అందులో పేర్కొన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Vishnu Manchu (@vishnumanchu)

ఇక ఇదిలాఉండగా ఈ సినిమాతో మంచు ఫ్యామిలీ నుంచి థర్డ్ జనరేషన్ నటుడు ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. విష్ణు తనయుడు అవ్రామ్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనుండటం విశేషం. కాగా ఈ సినిమాను అవా ఎంటర్‌టైన్‌మెంట్‌ మరియు 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై మంచు విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్‌ బాబు నిర్మిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి సంయుక్తంగా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + nineteen =