ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ లో ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. పెద్ద సినిమా అని లేదు చిన్న సినిమా అని లేదు హిట్ అయిన సినిమాలను మళ్లీ రీరిలీజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ సినిమా కూడా రీ రిలీజ్ కు సిద్దమైంది. ఆ సినిమా మరేదో కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఆస్కార్ అవార్డ్ ను సైతం అందించిన సినిమా ఆర్ఆర్ఆర్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈసినిమా రిలీజ్ అయి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈసినిమా ఇక్కడ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక్కడ మాత్రమే కాదు వేరే భాషల్లో కూడా ఈసినిమా రికార్డులు క్రియేట్ చేసింది. అంతేకాదు ఆస్కార్ తో పాటు ఈసినిమాకు ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులు సైతం దక్కాయి.
ఇప్పుడు ఈసినిమాను మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈసినిమా రీరిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. మే 10వ తేదీన థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీలోనూ రీరిలీజ్ కానున్న ఈసినిమా 2డీ, 3డీ ఫార్మాట్లలో వస్తోంది.
👯♂️👯♂️👯♂️
Yes, you guessed it right! 🤩🥳
We can’t contain our excitement because #rrr phir se theatres mein aa raha hain on 10th May 🔥🌊@ssrajamouli @jrntr @alwaysramcharan @ajaydevgn @aliaabhatt @jayantilalgada #RRR #InCinemas #10May pic.twitter.com/Bt8jWCfHBF— Pen Movies (@PenMovies) May 6, 2024
ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటించింది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి, రాహుల్ రామకృష్ణ నటించారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మించగా. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































