కార్తిక్ జి క్రిష్ దర్శకత్వంలో సిద్దార్ధ్, దివ్యాంశ కౌశిక్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా ‘టక్కర్’. ఈసినిమా నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈసినిమాను రిలీజ్ చేశారు. యాక్షన్ ఎంటర్ టైనర్ తో పాటు థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉండటంతో సినిమాకు మంచి పాజిటివ్ టాకే దక్కింది. అంతేకాదు మొదటిసారి సిద్దార్థ్ మాస్ రోల్ లో నటించి మెప్పించాడు. దీంతో ఈసినిమాా కలెక్షన్స్ ను కూడా బాగానే రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా మేకర్స్ ఈసినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ను ప్రపంచవ్యాప్తంగా ఈసినిమా 2.4 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 75 లక్షల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను సాధించినట్టు తెలుస్తుంది .ఇక తమిళ్ లో సినిమా మొదటి రోజు 1.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే 2.43 కోట్లు రాబట్టుకుంది. వీకెండ్ కాబట్టి ఈరెండు రోజుల్లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.
కాగా ఈసినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోగా నటించింది. ఇంకా ఈసినిమాలో అభిమన్యు సింగ్, యోగిబాబు తదితరులు ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్ పై సుధన్ సుందరం, జయరాం నిర్మించారు.
సినిమాటోగ్రఫీ వాంజినాథన్ మురుగేశన్, సంగీతం నివాస్ కె ప్రసన్న అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: