పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రస్తుతం తన ఫోకస్ సినిమాలపై పెట్టాడు. వీలైనంత త్వరగా తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్ లను పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఇక పవన్ లిస్ట్ లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ లలో ఓజీ ఒకటి. సుజీత్ దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో వస్తున్న సినిమా ఇది. ఈసినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనుండడంతో ఈసినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ప్రస్తుతం అయితే ఈసినిమా కూడా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇప్పటికే కొత్త షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ కూడా జాయిన్ అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో అర్జున్ దాస్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈవిషయాన్ని ఇప్పటికే చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమాలో తన డబ్బింగ్ పై కూడా క్లారిటీ ఇచ్చాడు. చాలా మంది ఓజీ సినిమాకు నేనే డబ్బింగ్ చెప్తానా?లేదా? అని అడుగుతున్నారు. డౌట్స్ పెట్టుకోకండి నేనే డబ్బింగ్ చెప్తాను అంటూ స్పష్టం చేశాడు అర్జున్ దాస్. మరి అర్జున్ దాస్ ది ఎంత బేస్ వాయిసో తెలిసిందే. తన బేస్ వాయిస్ సినిమాకు ప్రధాన బలం అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈసినిమాలో ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. తెలుగు తోపాటు హిందీ, మలయాళం, తమిళ్ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకి సిద్ధమవుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: