సామజవరగమన రిలీజ్ డేట్ ఫిక్స్

sri vishnu samajavaragamana release date fixed

కెరీర్ మొదటి నుండీ విభిన్నమైన కథలు, విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు శ్రీ విష్ణు. సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా తను చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని చూసుకుంటాడు. గత ఏడాది అల్లూరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీ విష్ణు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా వస్తున్న సినిమా సామజవరగమన. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా రిలీజ్ డేట్ పై ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు మేకర్స్. కానీ ఒకవైపు షూటింగ్ జరుపుతూనే మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాాలు కూడా మొదలుపెట్టారు. అంతేకాదు ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. జూన్ 29వ తేదీన ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు.

కాగా ఈసినిమాలో రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఏకే ఎంటర్‌ టైన్‌ మెంట్‌ బ్యానర్‌, హాస్య మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 3 =