లెజండరీ డైరెక్టర్ మణిరత్నం,పొన్నియిన్ సెల్వన్ 2 రీసెంట్ గా విడుదలై సూపర్ హిట్ అనిపించుకుంది.ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 300కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.గత ఏడాది విడుదలైన ఫస్ట్ పార్ట్ 400కోట్ల కు వసూళ్లను రాబట్టింది.మొదటి భాగం కంటే రెండో భాగం కు టాక్ బాగున్నప్పటికీ మొదటి భాగం కలెక్షన్స్ ను బీట్ చేయలేకపోయింది.ఇక పొన్నియిన్ సెల్వన్ 2 ఓటిటి లోకి వచ్చేసింది.అమెజాన్ ప్రైమ్ నేటి నుండి ఈసినిమాను తెలుగు తోపాటు తమిళ ,కన్నడ ,మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ అనే చారిత్రక నవల ఆధారంగా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ 2లో విక్రమ్ ,కార్తీ ,జయం రవి ,త్రిష,ఐశ్వర్యా రాయ్ ,శోభిత దూళిపాళ్ల,ఐశ్వర్య లక్ష్మి తదితరులు కీలకపాత్రల్లో నటించారు.టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా మద్రాస్ టాకీస్ ,లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మించాయి.
ఇక ఈసినిమా తరువాత మణిరత్నం తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు.తన డ్రీం ప్రాజెక్ట్ గా చెప్పుకున్న పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలుగా విడుదలై సక్సెస్ సాధించింది. మరి ఈసారి మణిరత్నం ఏ జోనర్ ను ఎంచుకుంటారో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: