తెలుగు, తమిళ చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి తిరుగులేని స్థానాన్ని దక్కించుకున్న విలక్షణ నటుడు చియాన్ విక్రమ్. తన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యత ఉండేలా చూసుకుంటాడు. ఇక రీసెంట్ గానే పొన్నియన్ 2 సెల్వన్ సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ తో వచ్చేస్తున్నాడు చియాన్ విక్రమ్. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా తంగలాన్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. చాలా వరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది కూడా. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న విక్రమ్ గాయపడతంతో షూట్ కు బ్రేక్ పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రంజిత్ ఈసినిమా షూటింగ్ గురించి చెబుతూ.. ఇప్పటికే ఈసినిమా సక్సెస్ ఫుల్ గా 105 రోజుల షూటింగ్ ను పూర్తిచేసుకుందని తెలిపాడు. అంతేకాదు ఇంకా 20 రోజుల్లో ఈసినిమా మొత్తం షూటింగ్ పూర్తవుతుందని స్పష్టం చేశాడు. షూటింగ్ పూర్తయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టి.. వచ్చే ఏడాది ప్రధమార్థంలో ఈసినిమాను రిలీజ్ చేయాలను ప్లాన్ చేస్తున్నారు.
కాగా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. పార్వతి తిరువొత్తు, డేనియల్ కాల్టాగిరోన్, మాళవిక మోహనన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: