అలా వచ్చాడో లేదో అప్పుడ్ రికార్డులు క్రియేట్ చేయడం మొదలుపెట్టేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్ లో గుంటూరు కారం అనే మాసీ టైటిల్ తో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. అయితే ఈసినిమా షూటింగ్ మొదలైనప్పటి నుండీ పెద్దగా అప్ డేట్లు ఇచ్చింది లేదు చిత్రయూనిట్. మధ్యలో ఏదో ఒకటి రెండు పోస్టర్లు రిలీజ్ చేశారు అంతే. దాంతో ఈసినిమా నుండి సాలిడ్ అప్ డేట్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులకు పర్ఫెక్ట్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. గ్లింప్స్ కు మాములు రెస్పాన్స్ రావడంలేదు. గుంటూరు కారం టైటిలే ఫుల్ మాస్ గా ఉందనుకుంటే మహేష్ మేకోవర్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. బీడీ కాల్చుతూ ఇంతవరకూ కనిపించనంత మాస్ గా మహేష్ బాబు కనిపిస్తున్నాడు. అంతేకాదు ఈసినిమాలో యాస కూడా మాట్లాడేలా కనిపిస్తున్నాడు. అందుకే టైటిల్ గ్లింప్స్ తోనే రికార్డులు సెట్ చేసేస్తున్నాడు. తాజాగా ఈ మాస్ స్ట్రైక్ గ్లింప్స్ 24 గంటల్లో ఏకంగా 25 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని ఆల్ టైం రికార్డు సొంతం చేసుకుని ఇంకా యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. మరి మహేష్ పుట్టినరోజు నాడు మరోో బిగ్ అప్డేట్ ఇవ్వనున్నారు. అది ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే అప్పటివరకూ వెయిట్ చేయాల్సిందే.
𝐀𝐋𝐋 𝐓𝐈𝐌𝐄 𝐑𝐄𝐂𝐎𝐑𝐃 🔥⚡
𝟐𝟓 𝐌𝐈𝐋𝐋𝐈𝐎𝐍+ Real-time Views in just 𝟐𝟒 hours 💥
The Highly Inflammable MASS STRIKE from #GunturKaaram 🔥 created a BLAST ❤️🔥🤙
𝐓𝐑𝐄𝐍𝐃𝐈𝐍𝐆 #𝟏 ▶️ https://t.co/HxmnoVf4jG#SSMB28MassStrike Super 🌟 @urstrulyMahesh #Trivikram… pic.twitter.com/RVt7ZkrU9L
— Haarika & Hassine Creations (@haarikahassine) June 1, 2023
కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: