అలనాటి అందాల నటుడు సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ అంటే కృష్ణ అని మారుపేరు. అందుకే తన కేరీర్ లో ఎన్నో విజయాలను అందుకున్నాడు. ఇక నేడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా, టాలీవుడ్ లో మొట్టమొదటి కౌబాయ్ సినిమా అయిన మోసగాళ్లకు మోసగాడు సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈసందర్భంగా మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా ఎమోషనల్ లెటర్ ను షేర్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాన్నగారి వీరాభిమానుల్లో నేనూ ఒకడిని.. మా అభిమానులందరికీ సూపర్ స్టార్ కృష్ణ గారు పద్మాలయా స్టూడియోస్ బ్యానర్ పై తీసిన ఎన్నో ఎన్నో గొప్ప సినిమాల్లో ‘మోసగాళ్లకు మోసగాడు’ అంటే ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం. ఆ రోజుల్లోనే హాలీవుడ్ స్థాయిలో చిత్రాలను తలదన్నే స్థాయిలో తెలుగు చిత్రాన్ని నిర్మించి , విజయవంతం చేసిన సాహసి నాన్నగారు.
52 యేళ్ల క్రితమే గుర్రాలు, గన్ ఫైటింగ్‌లు, భారీ సెట్టింగులు, బ్యూటిపుల్ లొకేషన్స్, ట్రెషర్ హంట్.. అతిపెద్ద తారాగణం. కౌబాయ్ గెటప్స్ తో బడ్జెట్ పరిధులు అధిగమించి తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు.. ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, వంటి బాషల్లోనూ ఈ సినిమా చూపించిన ఘనత నాన్న గారికి దక్కుతుంది. ఈ రోజు బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను 4కే టెక్నాలజీతో ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ చేసాము. తెలుగు సినిమాకు లెజెండ్ అండ్ విజనరీ నాన్నగారు. మొదటి స్టీరియో ఫోనిక్ సౌండ్. మొదటి సినిమా స్కోప్,.. మొదటి 70ఎంఎం, మొదటి జేమ్స్‌బాండ్, మొదటి కౌబాయ్ వంటి ఎన్నో కొత్త హంగులను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత నాన్నగారికే దక్కుతుందన్నారు. ఇక ఆయన జయంతి సందర్భంగా మోసగాళ్లకు మోసగాడు’ సినిమాను సరికొత్త టెక్నాలజీతో రీ రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమాను థియేటర్స్‌లో చూసి సరికొత్త అనుభూతి పొంది ఆయన్ని స్మరించుకుందాం అన్నారు.
ఇక ఇదిలా ఉండగా కృష్ణ ప్రతి పుట్టిన రోజు నాడు మహేష్ తన సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వడం కామన్ అయిపోయింది. ఈరోజు కూడా కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా తన కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ తో వచ్చేస్తున్నాడు. మోసగాళ్లకు మోసగాడు రీ రిలీజ్ థియేటర్స్ లో నేడు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు మహేష్- త్రివిక్రమ్ సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: