మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి నుండి హతవిధీ సాంగ్ రిలీజ్

hathavidi lyrical song out from miss shetty mr polishetty

ప్రస్తుతం రిలీజ్ కాబోతున్న క్రేజీ కాంబినేషన్స్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క, యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టిది. మహేష్ బాబు.పి దర్శకత్వంలో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్నసినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈసినిమాాపై ముందు నుండీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈసినిమాలో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా నటిస్తుండగా అనుష్క చెఫ్ పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈనేపథ్యంలో ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తూ వస్తున్నారు. రీసెంట్ గానే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈసినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేయగా.. ఈసినిమా నుండి ఇప్పుడు రెండో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. హతవిధీ ఏందిదీ? అంటూ వచ్చే రెండో పాటను నేడు రిలీజ్ చేయగా ఈపాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించాడు. ఇంకా ఈపాటలో ఉన్న విశేషం ఏంటంటే తమిళ స్టార్ హీరో ధనుష్ ఈ పాటను పాడటం. ఈపాటలో నవీన్ పోలిశెట్టి కి ఎదురైన కష్టాలు, దురదృష్టం గురించి చెప్పడం జరిగింది. ఇక ధనుష్ పాడిన ఈపాట క్యాచీ గా ఉండి ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీ కి నిరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా రధన్ మ్యూజిక్ ఇస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి చాలా గ్యాప్ తరువాత వస్తున్న ఈసినిమా అనుష్క కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − seven =