విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సినిమా ఉగ్రం. నాంది తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది. మిస్సింగ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుస మిస్సింగ్ కేసులు నమోదు కావడం, వాటిని అల్లరి నరేశ్ పోలీసాఫీసర్‌గా ఎలా చేధించాడనే నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కింది. ఇక ఈసినిమాలో అల్లరి నరేష్ డ్యూయల్ షేడ్స్‌లో ప్రేక్షకులు ఇదివరకెన్నడూ చూడని లుక్‌లో కనిపించి.. మంచి టాక్ నే సొంతం చేసుకున్నాడు. నటనపరంగా మరోసారి సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు నరేష్. ఈ సినిమాలో ఫైట్స్ అయితే అదిరిపోయాయి. కలెక్షన్స్ పరంగా కూడా డీసెంట్ కలెక్షన్స్ ను అందించింది ఈసినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీ లోకి కూడా వచ్చేస్తుంది. ఈసినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. జూన్ 2వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. ఈవిషయాన్ని అధికారికంగా తెలియచేశారు. మరి మిస్సింగ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమాను థియేటర్లలో చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయోచ్చు.
a cop’s race against time to unmask the truth and save his family! ⚡️#UgramOnPrime, June 2 pic.twitter.com/Z9mLaU2HFZ
— prime video IN (@PrimeVideoIN) May 31, 2023
కాగా ఈసినిమాల మిర్నా హీరోయిన్ గా నటించింది. ఇంద్రజ, శరత్ లోహితాశ్వ, శత్రు తదితరులు కీలక పాత్రలు పోషించారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి,హరీష్ పెద్ది ఈసినిమాను నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సిద్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: