సెన్సార్ పూర్తిచేసుకున్న కృష్ణమ్మ

Kirshnamma Movie completes censor formalities

విభిన్నమైన పాత్రలు చేసి ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు సత్యదేవ్. వాటిలో కృష్ణమ్మ సినిమా కూడా ఒకటి. వీవీ గోపాల కృష్ణ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా కృష్ణమ్మ సినిమా వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాను మే3వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ మే 10వ తేదీకి రిలీజ్ న వాయిదా వేశారు. మరో రెండు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు రిలీజ్ అవ్వగా అన్నీసినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇప్పుడు ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. సెన్సార్ బృందం ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ను అందించింది.

ఇంకా ఈసినిమాలో లక్ష్మణ్, కృష్ణ, అథిరా రాజ్, అర్చన, నంద గోపాల్, రఘు కుంచె, తారక్, సత్యం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాలబైరవ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.