విజయ్ దేవరకొండ బర్త్ డేన రానున్న అప్డేట్స్ ఇవే 

Vijay Deverakonda Birthday Updates revealed
రీసెంట్ గా ది ఫ్యామిలీ స్టార్ తో పలకరించిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన 12వ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.నిన్న ఈసినిమా కొత్త షెడ్యూల్ వైజాగ్ లో స్టార్ట్ అయ్యింది.జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు.గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది.అనిరుధ్ సంగీతం అందిస్తుండగా హీరోయిన్ విషయం లో క్లారిటీ రావాల్సివుంది.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.ఇక ఈనెల 9న విజయ్ తన బర్త్ డేను జరుపుకోనున్నాడు.ఈ సందర్భంగా  ఈసినిమా నుండి అప్డేట్ రానుంది.టైటిల్ ను ప్రకటించే ఛాన్స్ వుంది.
 
ఇదిలావుంటే రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా తో తన నెక్స్ట్ సినిమా చేయనున్నాడు విజయ్.ప్రముఖ నిర్మాతలు రాజు ,శిరీష్ ఈసినిమాను నిర్మించనున్నారు.రీసెంట్ గానే అఫీషియల్ గా ప్రకటించారు.ఈ సినిమా రూరల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా రానుంది.ఈ గురువారం ఈసినిమా నుండి కూడా అప్డేట్ రానుంది. సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు.
 
ఇక తనకు టాక్సీవాలాతో హిట్ ఇచ్చిన రాహుల్ సాంకృత్యాన్ తో విజయ్ దేవరకొండ  మరో సినిమా చేయనున్నాడట.నానితో శ్యామ్ సింగ రాయ్ తరువాత రాహుల్ మరో సినిమాను చేయలేదు.విజయ్ కోసం వెయిట్ చేశాడు.ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ ఫిక్స్ అయ్యిందని సమాచారం.మైత్రి మూవీ మేకర్స్  ఈసినిమాను నిర్మించనుందట.విజయ్ బర్త్ డేన ఈసినిమాను అఫీషియల్ గా ప్రకటించనున్నారు.
 
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.