గత ఏడాది బెదురులంక 2012 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తికేయ. అయితే ఈసినిమా సరైన విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వస్తున్న సినిమా భజే వాయి వేగం. నాన్న కోసం కొడుకు ఏంచేశాడు అనే నేపథ్యంతో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే మంచి రెస్పాన్సే సొంతం చేసుకుంది. ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. సెట్ అయ్యిందే అంటూ వచ్చే లవ్ సాంగ్ ను మే9వ తేదీన ఉదయం 9 గంటల 9 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
#BhajeVaayuVegam First Single, a celebratory love number – #SetAyyindhe out on May 9th at 9.09 AM 🕺🏼🤩
A @radhanmusic foot tapping musical & ‘Saraswathi Putra’ @ramjowrites massy lyrical 🎺
Promo Out Soon!@ActorKartikeya @Ishmenon @RAAHULTYSON @Dir_Prashant @radhanmusic pic.twitter.com/RwOGReyBqc
— UV Creations (@UV_Creations) May 6, 2024
కాాగా ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ హ్యాపీడేస్ రాహుల్ టైసన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ లో ఈసినిమాను నిర్మిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్, సంగీతం రధన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ – కపిల్ కుమార్ అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: