మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ అనే టైటిల్ తో ఈసినిమా రూపొందుతుంది. ఇక లెజెండరీ డైరెక్టర్, స్టార్ హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి మొదటి నుండీ భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో అంటే అటు ఐఏఎస్ పాత్రలో మరోవైపు గ్రామస్థుడిగా కనిపించనున్నాడట. ప్రస్తుతం అయితే శంకర్ ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. గత షెడ్యూల్ లో ఈసినిమాకు సంబంధించి కీలక క్లైమాక్స్ ను షూట్ చేశారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా నెక్ట్స్ షేడ్యూల్ ను జూన్ 4 నుండి మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. మైసూర్ లో జరిపే ఈ షెడ్యూల్ జూన్ 12 వరకూ జరగనున్నట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్, సముద్రఖని ఇంకా ఇతర నటీ నటులో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: