ఇప్పుడు మల్టీస్టారర్లు కామన్ అయిపోయాయి. ఒకప్పుడు అరకొరగా మల్టీస్టారర్ సినిమాలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఇండస్ట్రీల్లో చోటుచేసుకుంటున్న మార్పులు వల్ల స్టార్ హీరోలు సైతం ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతేకాదు తెలుగు అయినా హిందీ అయినా ఎక్కడైనా సరే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. దానికి ఉదాహరణే టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్ లో రాబోతున్న వార్ సినిమా. ఇప్పుడు మరో భారీ మల్టీస్టారర్ కు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ అగ్రహీరో ఈ భారీ మల్టీస్టారర్ కు శ్రీకారం చుట్టనున్నట్టు సమాచారం. కన్నడ రాజ్ కుమార్ తో కలిసి బాలకృష్ణ మల్టీస్టారర్ చేయనున్నారని అంటున్నారు. అంతేకాదు ఈ మల్టీస్టారర్ రెండు భాగాలుగా తెరకెక్కుతుందని.. మొదటి పార్ట్ లో కన్నడ శివకుమార్ అలానే సెకండ్ పార్ట్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ కనిపించనున్నారన్న వార్తలు జోరుగు వినిపిస్తున్నాయి. ఒకవేళ రజనీకాంత్ కు కనుక కుదరకపోతే విలక్షణ నటుడు కమల్ హాసన్ ను శాండిల్ ఉడ్ డైరెక్టర్ హర్ష ఈ భారీ మల్టీస్టారర్ కు దర్శకత్వం వహించబోతున్నాడని.. శివరాజ్‌కుమార్ సొంత బ్యానర్‌లో మరో ఇద్దరు నిర్మాతలతో కలిసి ఈ మల్టీస్టారర్ ను నిర్మించబోతున్నారని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. NBK 108 అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలీల ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ చిత్రానికి కూడా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: