క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్ ఫ్రాంచైజ్ ఎట్టకేలకు రెండు పార్ట్ లుగా రూపుదిద్దుకొని.. రెండు పార్ట్ లు కూడా రిలీజ్ అయిపోయాయి. చోళుల చరిత్ర నేపథ్యంలో తమిళ్ లో మంచి ప్రాముఖ్యం చెందిన పొన్నియన్ సెల్వన్ కథ ఆధారంగా ఈసినిమాను రూపొందించాడు మణిరత్నం. ఫస్ట్ పార్ట్ గత ఏడాది రిలీజ్ అయిపోయింది. పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 ఒక్కటే 500 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక ఏప్రిల్ 28వ సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అయిపోయింది. ఈసినిమా కూడా సూపర్ హిట్ అయింది. అంతేకాదు మొదటి పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఇంకా ఎక్కువ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈసినిమా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను సాధించింది. దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు సొంతం చేసుకున్నారు. ఈమధ్య అమెజాన్ లో రెంటల్ పద్దతిలో ముందుగా చూసే అవకాశాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఈసినిమాను మే 26 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్టు తెలుస్తుంది.. తమిళ్ తో పాటు తెలుగు ఇంకా ఇతర భాషల్లో ఈసినిమా స్ట్రీమింగ్ కానుంది. జూన్ సెకండ్ వీక్ నుంచి అమెజాన్ సబ్స్క్రైబర్లకు ఫ్రీగా పొన్నియన్ సెల్వన్ -2 అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
కాగా ఈసినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, ప్రభు, శరత్ కుమార్, పార్దిబన్, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మీ తదితరులు నటించాారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫీ.. రవి వర్మన్, ఎడిటర్.. ఎ. శ్రీకర్ ప్రసాద్ అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: