ఎన్టీఆర్ అభిమానులు గత రెండు రోజులుగా వెయిట్ చేస్తున్న టైం వచ్చేసింది. రేపు అంటే మే20 వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆయన నటిస్తున్న ఎన్టీఆర్ 30 వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను మే19వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. దాంతో ఎన్టీఆర్ లుక్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులకు బ్రేక్ వేస్తూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దేవర అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ మాత్రం అదిరిపోయింది. ఎన్టీఆర్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. మరి ఎన్టీఆర్ లుక్ తోనే సినిమాపై అంచనాలు ఈరేంజ్ లో పెరిగిపోతే ముందు ముందు అప్ డెేట్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కొరటాల శివ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జనతా గ్యారేజ్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు కొరటాల శివ కూడా ఎక్కువ టైమ్ తీసుకొని మరి ఎన్టీఆర్ కోసం సాలిడ్ కథను తయారు చేశాడు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ దశలో ఉంది.
కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: