విజయ్ ఆంటోని బిచ్చగాడు2 రివ్యూ

vijay antony bichagadu 2 telugu movie review

తమిళ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా బిచ్చగాడు 2. ఈసినిమా 2016లో రిలీజ్ అయిన సూపర్ హిట్ మూవీ బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. బిచ్చగాడు సినిమాకు ఈసినిమా సీక్వెల్ కావడంతో ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉంది..ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది అన్న విషయాలు తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. విజయ్ ఆంటోని, కావ్య థాపర్, దేవ్ గిల్, హరీష్ పెరడి, జాన్ విజయ్, రాధా రవి, మన్సూర్ అలీ ఖాన్, వైజీ మహేంద్రన్, రాజా కృష్ణమూర్తి తదితరులు
దర్శకత్వం.. విజయ్ ఆంటోని
బ్యానర్స్..విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్
నిర్మాతలు..ఫాతిమా విజయ్ ఆంటోని
సంగీతం.. విజయ్ ఆంటోని
సినిమాటోగ్రఫి.. ఓం నారాయణన్

కథ..

విజయ్ గురుమూర్తి(విజయ్ ఆంటోని) కోట్లకు అధిపతి. ఇండియాలోనే అత్యంత ధనవంతుల్లో ఒకడు. మరోవైపు సత్య(విజయ్ ఆంటోని) బిచ్చగాడు. చిన్నప్పుడే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. జైలు నుండి బయటకు వచ్చిన తరువాత తన చెల్లిని వెతుకుతుంటూ ఉంటాడు. ఇక విజయ్ గురుమూర్తి కి ఫ్రెండ్ అయిన అరవింద్ (దేవ్ గిల్) విజయ్ ఆస్తిని కొట్టేయాలని చూస్తుంటాడు. అలాంటి సమయంలో కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విజయ్ ప్లేస్ లోకి సత్య వస్తాడు. మరి విజయ్ ప్లేస్ లోకి సత్య ఎలా వచ్చాడు..? వచ్చి ఏం చేశాడు..? తన చెల్లిని కలిశాడా?లేదా? బిచ్చగాళ్లకు ఏం చేశాడు..? ఇంతకీ విజయ్ గురుమూర్తికి ఏమైంది అన్నది మిగిలిన కథ.

విశ్లేషణ..
బిచ్చగాడు సినిమా చిన్న సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా. డబ్బున్న హీరో తన తల్లి అనారోగ్యంతో భాదపడుతున్న టైంలో బిచ్చగాడిలా మారితే తన తల్లిని కాపాడుకోవచ్చు అని తెలుసుకుని..తాను బిచ్చగాడిలా మారి తన తల్లిని కాపాడుకుంటాడు. తల్లి కొడుకుల సెంటిమెంట్ బాగా కనెక్ట్ అవ్వడంతో మంచి విజయాన్ని అందుకుంది.

దాదాపు ఏడేళ్ల తరువాత బిచ్చగాడు 2 సినిమా వచ్చింది. ఈసినిమా బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ గా వస్తుంది అనుకున్నారు. అయితే సినిమా చూసిన తరువాత మాత్రం బిచ్చగాడు సినిమాకు ఈ సీక్వెల్ కు చాలా తేడా కనిపిస్తుంది. ఈసినిమాలో బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనే కొత్త పాయింట్ ను యాడ్ చేశాడు విజయ్ ఆంటోని. సినిమా మొదలైనప్పటి నుంచి చివ‌రి వ‌ర‌కు క‌థ‌ను ఉత్కంఠ‌గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు విజయ్. బ్రెయిన్ మార్పిడి త‌ర్వాత విజ‌య్ ప్లేస్‌లోకి వ‌చ్చిన సత్యం ఏం చేస్తున్నాడు అనేది ప్రేక్షకుల ఊహకు అందరకుండా తీసి అలరించాడు.

విజ‌య్ గురుమూర్తి, స‌త్య నేప‌థ్యాలు, బ్రెయిన్ మార్పిడి అంశాల‌తో ఫ‌స్ట్ హాఫ్‌ను రాసుకోగా.. సత్య విజయ్ గా మారడం.. యాంటీ బికిలీ స్కీమ్ మొద‌లుపెట్టి బిచ్చ‌గాళ్ల‌కు స‌హాయం చేయ‌డం, ప్ర‌భుత్వం దానిని అడ్డుకోవడం వంటి అంశాలతో ఎంగేజింగ్ మలిచాడు.

పెర్ఫామెన్స్..
విజయ్ ఆంటోని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సినిమాల్లో తనే వన్ మ్యాన్ షోగా నిలుస్తాడు. ఇక ఈసినిమాలో కూడా తనే వన్ మ్యాన్ షో చేశాడు. రెండు పాత్రల్లో కూడా చాలా బాగా నటించి మెప్పించాడు. ఇక హీరోయిన్ కావ్య థాపర్ హేమ పాత్రలో బాగానే నటించింది. తన హోమ్లీ లుక్స్ తో అలానే అందంగా తన నటనతో ఆకట్టుకుంది. దేవ్ గిల్, రాధారవి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర బాగానే నటించారు.

టెక్నికల్ వాల్యూస్
సాంకేతిక విభాగానికి వస్తే ఈసినిమాకు విజయ్ ఆంటోనినే సంగీతాన్ని కూడా అందించాడు. దీంతో తన సినిమాకు ఏం కావాలో అలాంటి మ్యూజిక్ నే అందిచాడు. పాటలు ఓకే.. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఇంకా ఓం నారాయణ్ సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. దర్శకుడు విజయ్ ఆంటోని డైరెక్షన్ పరంగా బాగా ఆకట్టుకున్నాడు. నిర్మాత విజయ్ ఆంటోని భార్య ఫాతిమానే కాబట్టి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించినట్టు తెలుస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే బిచ్చగాడు సినిమాకు కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్ తోనే ఉంటుంది బిచ్చగాడు2. అయితే హీరోగా, డైరెక్టర్ గా మాత్రం విజయ్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ ఒకసారి చూసి ఎంజాయ్ చేసే సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =