సైంధవ్-నవాజుద్దీన్ రోల్ రివీల్

nawazuddin siddiqui poster released from saindhav movie

విక్టరీ వెంకటేష్ శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న సినిమా సైంధవ్. హిట్1, హిట్ 2 సినిమాలతో మంచి విజయాలను అందుకున్న శైలేష్ కోలను దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటం.. అందులోనూ ఈసినిమా మెడికల్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. మరోవైపు ఈసినిమాలో నటిస్తున్న నటీనటుల పోస్టర్లను కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే ఈసినిమాలో నటిస్తున్నటాలెంటెడ్ నటి శ్రద్ధ శ్రీనాథ్, రుహానీ సింగ్, ఆండ్రియా పాత్రలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేశారు. శ్రద్ధ శ్రీనాథ్ మనోజ్ఞ పాత్రలో అలానే రుహానీ సింగ్ డా.రేణు పాత్రలో, ఆండ్రియా జాస్మిన్ అనే పాత్రలో నటిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో తాజాగా ఆయన పాత్రకు సంబధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాలో నవాజుద్దీన్ వికాస్ మాలిక్ అనే పాత్రలో నటిస్తున్నాడు.

కాగా ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈసినిమాకు కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత సైంధవ్ పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − eleven =