పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి(ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) మొదటి షెడ్యూల్ ముంబై లో జరుగుతుంది.పవన్ ఈషెడ్యూల్ లో 5రోజులు షూటింగ్ లో పాల్గొనగా హీరో, హీరోయిన్ తో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.ప్రస్తుతం మిగితా క్యాస్ట్ తో షూటింగ్ చేస్తున్నారు.ఇక ఈసినిమాలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈరోజు ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.సుజీత్ డైరెక్షన్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాకు సంబంధించి వరసగా అప్డేట్స్ ఇస్తుంది నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్.పవన్ ,సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న ఓజి పై భారీ అంచనాలు వున్నాయి. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో ఈసినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నారు.ఇదిలావుంటే బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో పవన్ ఫుల్ బిజీగా వున్నాడు. ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు సినిమాలో వున్నాయి.
ఇందులో ఒకటి ఓజి కాగా మిగతావి హరిహర వీరమల్లు,ఉస్తాద్ భగత్ సింగ్,వినోదయ సీతం రీమేక్.ఇప్పటికే పవన్,వినోదయం సీతం రీమేక్ షూటింగ్ ను పూర్తి చేశాడు. ఇక హరి హర వీరమల్లు కూడా 60శాతానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది.త్వరలోనే ఈసినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు.రీసెంట్ గా పవన్,ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి షెడ్యూల్ షూటింగ్ ను కూడా పూర్తి చేసాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: