మాస్ మహారాజా రవితేజ నటించిన రావణాసుర ఓటిటిలోకి వచ్చేసింది.ఈరోజు నుండి అమెజాన్ ప్రైమ్ ఈసినిమాను తెలుగు తోపాటు తమిళ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో స్వామి రారా ఫేమ్ సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్,దక్షా నాగర్కర్,మేఘా ఆకాష్,పూజిత పొన్నాడ,ఫారియా అబ్దుల్లా హీరోయిన్లు గానటించారు.సుశాంత్,జయరామ్,మురళీ శర్మ కీలకపాత్రల్లో కనిపించారు.హర్షవర్ధన్ రామేశ్వర్,భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా అభిషేక్ నామ,రవితేజ సంయుక్తంగా నిర్మించారు.ఈసినిమాలో నెగిటివ్ షేడ్ లో కూడా కనిపించిన రవితేజ ఆపాత్రలో అద్భుతమైన నటన కనబరిచాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలావుంటే ఈఏడాది ఇప్పటికే రవితేజవి రెండు సినిమాలు రిలీజ్ అవ్వగా మరో సినిమాకూడా రానుంది.రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరావు అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈసినిమా ఈఏడాది అక్టోబర్ 20న విడుదలకానుంది.స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ గా వంశీ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో రవితేజ టైటిల్ రోల్ లో కనిపించనున్నాడు.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు.ఈ సినిమా తెలుగు తోపాటు హిందీ తమిళ,కన్నడ,మలయాళ భాషల్లో విడుదలకానుంది.రవితేజ కు ఇదే మొదటి పాన్ ఇండియా మూవీ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: