చాలా గ్యాప్ తరువాత పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్. ఇక ఇప్పుడు అదే జోష్ తో జవాన్ అనే సినిమాతో వచ్చేస్తున్నాడు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. ఈకాంబినేషన్ వల్ల సినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమా నాన్ స్టాప్ గా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. అంతేకాదు ఈసినిమాను జూన్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఈసినిమా టీజర్ గురించి ఆసక్తికరమైన వార్త ఒకటి తెరపైకి వచ్చింది. ఈసినిమా టీజర్ ను మే ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే టీజర్ ను కూడా కట్ చేశారని.. టీజర్ నిడివి రెండు నిమిషాలు ఉందని అంటున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో షారుక్ రెండు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఒకటి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా.. మరొకటి గ్యాంగ్‌స్టర్‌గా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. ఈసినిమాలోనయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. విజయ్ సేతుపతి, ప్రియమణి, యోగి బాబు, సునీల్ గ్రోవర్ కూడా పలు పాత్రల్లో నటిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గౌరీఖాన్ నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది జూన్ 2న రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: