పవర్ సార్ పవన్ కళ్యాణ్,యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఓజి(ఒరిజినల్ గ్యాంగ్ స్టర్).అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా రానుంది ఈసినిమా.ఇటీవలే ఈసినిమా షూటింగ్ ప్రారంభమైంది.ప్రస్తుతం మొదటి షెడ్యూల్ ముంబై లో జరుగుతుంది.నిన్ననే ఈషూటింగ్ లో పవన్ కూడా జాయిన్ అయ్యాడు.మొత్తం 5రోజులపాటు ఈ షూటింగ్ లో పాల్గొననున్నాడు.ఈరోజు నుండి హీరోయిన్,హీరోల మధ్య వచ్చే సన్నివేశాలను షూట్ చేయనున్నారు.ఇక ఈసినిమాలో నటించే హీరోయిన్ ను అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్.నాని గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక మోహన్,హీరోయిన్ గా నటించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
𝑷𝑹𝑰𝒀𝑨𝑵𝑲𝑨 𝑴𝑶𝑯𝑨𝑵… We are very happy & excited to have you on board for #OG. ❤️@PawanKalyan @PriyankaaMohan @sujeethsign @dop007 @MusicThaman #ASPrakash @DVVMovies #FireStormIsComing#TheyCallHimOG pic.twitter.com/OMED1rGkrF
— DVV Entertainment (@DVVMovies) April 19, 2023
నాని గ్యాంగ్ లీడర్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక మోహన్ తరువాత శ్రీకారంలో నటించింది.అయితే ఈరెండు సినిమాలతరువాత తెలుగులో బ్రేక్ ఇచ్చి తమిళ సినిమాల్లో నటించింది ప్రియాంక.ఇక ఎట్టకేలకు చాలా రోజుల తరువాత మరో తెలుగు సినిమాకు సైన్ చేసింది.మరి ఓజి తో ప్రియాంక మోహన్ తెలుగులో బిజీ అవుతుందో లేదో చూడాలి.
డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈచిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో ఈసినిమా థియేటర్లలోకి రానుంది.ఇదిలావుంటే రెగ్యులర్ షూటింగ్స్ తో పవన్ ఫుల్ బిజీగా వున్నాడు.ఇటీవలే వినోదయ సీతం రీమేక్ షూటింగ్ పూర్తి చేసిన పవన్ ఆతరువాత ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్నాడు.ఆ సినిమా మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఓజి స్టార్ట్ చేశాడు.ఈ సినిమా మొదటిషెడ్యూల్ తరువాత హరి హర వీరమల్లు షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: