దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఆది పురుష్ సినిమా కూడా ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో రామాయణం ఆధారంగా ఈసినిమా వస్తుంది కాబట్టే ఈసినిమా అంత ఆసక్తి పెరిగిపోయింది. నిజానికి ఈసినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి. కానీ గ్రాఫిక్స్ కు టైమ్ పట్టడంతో ఆలస్యమవుతూ వస్తుంది. ముఖ్యంగా గత ఏడాది టీజర్ రిలీజ్ అవ్వగా కాస్త నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ను సొంతం చేసుకుంది. గ్రాఫిక్స్ పై ఫ్యాన్స్ సైతం నిరాశచెందారు. దాంతో చిత్రయూనిట్ రిలీజ్ ను వాయిదా వేసుకొని గ్రాఫిక్స్ పై ఇంకాస్త ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం అయితే ఆపనుల్లోనే ఉన్నారు. అప్పుడప్పుడు పలు పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు రిలీజ్ కు ముందే అరుదైన గౌరవం దక్కింది. ఈసినిమా జూన్ 16వ తేదీన దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. సినిమా రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్ లో ఆది పురుష్ సినిమా ప్రదర్శనకు ఎంపికైంది. ఇక ఈ విషయాన్ని దర్శకుడు ఓం రౌత్ తన సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. 2023 జూన్ 13వ తేదీ ఆది పురుష్ న్యూయార్కులో జరగనున్న ట్రిబెకా ఫెస్టివల్ లో ప్రదర్శితమవుతుంది. ఈ సినిమాని ఎంపిక చేసిన ట్రిబెకా జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు ఆది పురుష్ టీం సభ్యులందరికీ కృతజ్ఞతలు.ఈ వేడుక కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానంటూ ఈ సందర్భంగా డైరెక్టర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Beyond Excited and Honored! Adipurush, the epic saga of courage and devotion, is set to make its world premiere at the prestigious #TribecaFestival on the 13th of June in New York. pic.twitter.com/bUiKWR6H4b
— Om Raut (@omraut) April 18, 2023
కాగా 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈసినిమాలో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: