అఖిల్ తో పాటు అతని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్టైలీష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. దీంతో ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి.. ఇంకా చిత్రయూనిట్ కూడా ఈసినిమా మంచి సక్సెస్ ను అందుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఏజెంట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కాకినాడలో జరిగిన సంగతి తెలిసిందే కదా. ఇక ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో అఖిల్ మాట్లాడుతూ.. మీరు ఇచ్చిన ప్రేమ, అభిమానం, ఎనర్జీ వచ్చే పదిరోజుల రిలీజ్ వరకూ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. మీ అందరికీ కృతజ్ఞతలు. ఏజెంట్ రెండేళ్ళ జర్నీ. ఈ జర్నీని మాటల్లో ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు. ఈ జర్నీలో మానసికంగా చాలా మారాను. నాకు సినిమా, అభిమానులు అంటే ఎంత పిచ్చో ఇంకా అర్ధమైయింది. నేను ఇక్కడే వుంటాను మీ కోసం పని చేస్తూనే వుంటాను. మీ అభిమానం గుండెల్లో దాచిపెట్టుకుంటాను. సాక్షి వైద్య ఏజెంట్ లో సర్ ప్రైజ్ ప్యాకేజ్. సినిమా అంటే తనకి ప్రాణం. హిపాప్ తమీజా ప్రాణం పెట్టి మ్యూజిక్ చేశారు. బీజీఏం చాలా వైల్డ్ గా వుంటుంది. అనిల్ సుంకర గారు నా బ్యాక్ బోన్. అభిమానుల కోసం ఇంత పెద్ద సినిమా చేద్దాం.. అందరికీ పిచ్చెక్కిపోవాలని అన్నారు. అదే మాట మీద నిలబడ్డారు. ఆయన నా సపోర్ట్ సిస్టం.
ఏజెంట్ క్రెడిట్ అంతా దర్శకుడు సురేందర్ రెడ్డి గారికే ఇస్తాను. నన్ను ఇలా చూపించాలని ఇమాజిన్ చేసింది ఆయనే. నన్ను ఎప్పుడూ ఇలా ఊహించుకోలేదు. ఈ రోజు ఇంత నమ్మకంగా మాట్లడుతున్నానంటే ఏజెంట్ ఇచ్చిన ధైర్యం. ఏజెంట్ నాకు ధైర్యాన్ని ఇచ్చింది. సురేందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. అభిమానులు నాపై ఎంత బరువు పెట్టినా దాన్ని మోస్తాను, మీ కోసం వైల్డ్ గా వస్తూనే వుంటాను. మమ్మల్ని బ్లెస్ చేయడానికి విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు. ఏప్రిల్ 28న థియేటర్లో పిచ్చెక్కిపోవాలి అన్నారు.
కాగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. హిప్ హాప్ తమీజా సంగీతం సమకూర్చారు. రసూల్ ఎల్లోర్ కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























