మామ మశ్చీంద్ర- వైరల్ విశాలాక్షి గా ఈషా రెబ్బా

eesha rebba poster released from maama mascheendra movie

ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా మామ మశ్చీంద్ర. ఈసినిమాలో సుధీర్ మూడు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. లావుగా ఉండే దుర్గా అనే పాత్రలో అలానే పరుశురామ్ పాత్రలో ఇంకా డీజే పాత్రలో నటిస్తున్నాడు. దీంతో ఈసినిమాపై కూడా అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టేశారు. దీనిలో భాగంగానే ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈసినిమాలో ఒక కథానాయికగా ఈషా రెబ్బ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో తాజాగా ఈషాకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. నేడు ఈషా రెబ్బా పుట్టినరోజు కావడంతో తన పోస్టర్ ను రిలీజ్ చేస్తూ పాత్రను రివీల్ చేశారు. ఈసినిమాలో ఈషా వైరల్ విశాలాక్షి అనే పాత్రలో నటిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా మృణాలిని రవి మరో హీరోయిన్ గా నటిస్తుండగా.. అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్, మిర్చీ కిరణ్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు పీజీ విందా సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 14 =