ఇండస్ట్రీలలో ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోయిన సంగతి తెలిసిందే కదా. స్టార్ హీరోలు సైతం ఇప్పుడు వేరే భాషల్లో చేయడానికి ముందుకొస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ రేంజ్ పెరిగిపోవడంతో బాలీవుడ్ హీరోలు సైతం తెలుగు సినిమాల్లో నటించడానికి ముందుకొస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇప్పటికే ప్రభాస్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా వస్తున్న ఆదిపురుష్ సినిమాలో రావణుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇక మరో స్టార్ హీరో సినిమాలో నటించబోతున్నాడు సైఫ్ అలీఖాన్. ఆహీరో ఎవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ అయింది. ప్రస్తుతం అయితే షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో కాస్టింగ్ ను కూడా కొరటాల చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నాడు. దీనిలో భాగంగానే సైఫ్ అలీ ఖాన్ ను తీసుకున్నారు. నేడు సైఫ్ సెట్ లోకి అడుగుపెట్టారు. ఈసినిమాలో సైఫ్ విలన్ పాత్రలో నటించనున్నాడని అంటున్నారు. ఈనేపథ్యంలో మేకర్స్ పలు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Team #NTR30 welcomes #SaifAliKhan on board ❤🔥
The National Award winning actor joined the shoot of the high voltage action drama. @tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @YuvasudhaArts pic.twitter.com/RB6s2Xh45g
— NTR Arts (@NTRArtsOfficial) April 18, 2023
కాగా ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు. ఈసినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ను తీసుకున్నారు. విఎఫ్ఎక్స్ ను హాలీవుడ్ సినిమాలకి వర్క్ చేసిన బ్రాడ్ మిన్నిచ్ అందించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: