తన కెరీర్ మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటివరకూ పలు డిఫరెంట్ కథలతో అలరిస్తూనే ఉన్నాడు గోపీచంద్. ఆమధ్య సీటీమార్ సినిమాతో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అదే జోష్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడుతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రామబాణం సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా మే 5 వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, పాటలు అన్నీ ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఏప్రిల్ 20వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. అంతేకాదు వేదికను కూడా ఖరారు చేశారు. రాజమహేంద్రవరం లోని, విఎల్ పురం.. మార్గాని ఎస్టేట్స్ లో సాయంత్రం 5 గంటల నుండి ఈవెంట్ నిర్వహించనున్నారు.
Unleashing the world of #RamaBanam, Get ready for this Bombarding Theatrical Trailer🔥#RamabanamTrailer on April 20th💥
Massive Launch Event at Margani Estates, RJY❤️#RamabanamOnMay5 ✅
Macho Starr @YoursGopichand @DirectorSriwass @DimpleHayathi @MickeyJMeyer @peoplemediafcy pic.twitter.com/Nkf95qOVlB— People Media Factory (@peoplemediafcy) April 18, 2023
కాగా ఈసినిమాలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాలో ఇంకా జగపతిబాబు, ఖుష్బూ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తుంది.పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈసినిమా మే 5వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు రీసెంట్ గానే అధికారికంగా ప్రకటించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: