ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లుగా నిలిచిన ఈమధ్య కాలంలో చాలానే ఉన్నాయి. ప్రేక్షకులు సినిమాలు చూసే దృష్టి మారడంతో వేల కోట్ల బడ్జెట్ తో వచ్చిన సినిమాలు కూడా డిజాస్టరుగా మారి.. స్మాల్ బడ్జెట్ తో కంటెంట్ తో వచ్చిన సినిమాలు సక్సెస్ సాధించడం చూశాం. ఎంత బడ్జెట్ పెట్టారు, స్టార్ కాస్టింగ్ ఉందా లేదా.. డైరెక్టర్ ఎవరు అనే క్యాలిక్యులేషన్స్ ఇప్పుడు లేవు. కథలో కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈమధ్య కాలంలో వచ్చిన బలగం సినిమానే మరో ఉదాహరణగా చెప్పొచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పలు సినిమాల్లో కమెడియన్ గా అలానే బుల్లి తెరపై పలు కామెడీ షోల్లో అలరించిన వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ వచ్చిన సినిమా బలగం. చిన్న సినిమాలను, కొత్త దర్శకులను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో దిల్ రాజు ప్రొడక్షన్స్ సంస్థను ఏర్పాటు చేయగా అందులో మొదటి అవకాశం వేణుకి దక్కింది. వేణు కూడా తనకు ఇచ్చిన అవకాశాన్ని చాలా చక్కగా వాడుకొని బలగం లాంటి మెసేజ్ ఒరియెంటెడ్ సినిమాను తీశాడు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను అద్భుతంగా ఆవిష్కరించిన జీవనచిత్రంగా ప్రశంసలను అందుకుంది. ఈసినిమా రిలీజ్ అయి చాలా రోజులు అవుతున్నా కూడా ఇంకా ఏదో ఒక గుర్తింపును పొందుతూనే ఉంది.
ఇక ఈసినిమా వరుసగా అంతర్జాతీయ అవార్డులను కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే బలగం సినిమా రెండు లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డులు అందుకుంది. బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఒనికో ఫిల్మ్ అవార్డు(ఉక్రెయిన్) సొంతం చేసుకుంది. అమెరికా వాషింగ్టన్ డీసీ ఇంటర్నేషనల్ సినిమా ఫెస్టివల్ లో నాలుగు కేటగిరీల కింద బలగం సినిమా అవార్డులు సొంతం చేసుకుంది. ఆమ్ స్టర్ డామ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో బెస్ట్ డైరెక్టర్ అవార్డును వేణు గెలుచుకున్నారు. ఇలా అవార్డులను కొల్లగొడుతూనే ఉంది. అలా ఇప్పటి వరకూ బలగం సినిమా పలు ఇంటర్నేషన్ అవార్డ్స్‌లో పలు విభాగాల్లో ఏకంగా 40 ప్రెస్టీజియస్ అవార్డ్స్‌ను సొంత చేసుకుంది. ఇప్పుడిదే అంతటా హాట్ టాపిక్ గా మారింది.
We are thrilled to share that #Balagam has gone global and has been honored with 40+ international awards and counting! 😍❤️
Our team’s hard work and commitment to excellence have been recognized on the world stage!! 🤩🤩#BalagamGoesGlobal pic.twitter.com/KRkzc4QeZ4
— Dil Raju Productions (@DilRajuProdctns) April 17, 2023
కాగా ప్రియదర్శి ఈసినిమాలో కావ్యా కల్యాణ్‌రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, జయరాం, విజయలక్ష్మీ, స్వరూప కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజు సమర్పణలో దిల్ రాజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈసినిమాకు హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: