ఏజెంట్- అఖిల్ నెవర్ బిఫోర్ రియల్ స్టంట్

akhil real stunt in agent promotions

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఏజెంట్. పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న ఈసినిమా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న మేకర్స్ సినిమాని జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈసినిమా ట్రైలర్ ను ఏప్రిల్ 18న రిలీజ్ చేస్తుండగా.. దానికోసం వేదికను కూడా ఫిక్స్ చేశారు. కాకినాడలో ఎంసీ లారిన్ హైస్కూల్ గ్రౌండ్స్‌లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా విజయవాడలో వైల్డ్ పోస్టర్ ని లాంచ్ చేసింది ఏజెంట్ టీమ్. ఈ వైల్డ్ లుక్ కు మరింత రెస్పాన్స్ దక్కింది. కండలు తిరిగిన శరీరంతో, ఫెరోషియస్ లుక్ తో, సంకెళ్ళు తెంచుతూ బీస్ట్ మోడ్ లో కనిపించడం వైల్డ్ గా వుంది. మరోవైపు పోస్టర్ లాంచ్ సందర్భంగా నెవర్ బిఫోర్ ఫీట్ చేశారు. 172 అడుగుల ఎత్తు నుంచి రోప్ సహాయంతో ఏజెంట్ మోడ్ లో అఖిల్ డైవ్ చేస్తూ కిందకు దిగిన రియల్ స్టంట్ అందరినీ సర్ప్రైజ్ చేసింది.

కాగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. హిప్ హాప్ తమీజా సంగీతం సమకూర్చారు. రసూల్ ఎల్లోర్ కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.