ఇండియన్ 2 నుండి సిద్దార్థ్ పోస్టర్ రిలీజ్

siddharth poster released from indian 2 movie

లెజెండరీ డైరెక్టర్ శంకర్ రెండు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో ఇండియన్2 సినిమా ఒకటి. ఈసినిమా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అని అందరికీ తెలుసు. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఈసినిమాను జూన్ నాటికి పూర్తి చేయాలని శంకర్ ఇప్పటికే వెల్లడించాడు.. ఆదిశగానే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో పడ్డాడు శంకర్. ఇక్కడ షెడ్యూల్స్ ను పూర్తిచేసుకున్న ఇండియన్2 టీమ్ రీసెంట్ గానే తైవాన్ వెళ్లి అక్కడ కూడా కొన్ని రోజులు షూటింగ్ ను జరుపుకుంది. తైవాన్‌ షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా షెడ్యూల్‌లో శంకర్‌ టీం బిజీగా ఉంది. సౌతాఫ్రికాలో 12 రోజులపాటు ఇంటెన్స్ యాక్షన్‌ సీక్వెన్స్ ను ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో సిద్దార్థ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో నేడు సిద్దార్థ్ పుట్టినరోజు సందర్భంగా ఆపోస్టర్ ను రిలీజ్ చేస్తూ కన్ఫామ్ చేశారు మేకర్స్. ఇండియన్ 2 టీమ్ నుండి హ్యాపీ బర్త్ డే సిద్దార్థ్ అంటూ బర్త్ డే విషెస్ అందించారు.

కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్ పై ఉద‌య‌నిధి స్టాలిన్‌, సుభాస్కరన్‌ ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − ten =