ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి.. తన టాలెంట్ తో నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. కేవలం హీరోగా మాత్రమే కాదు దర్శకుడిగా కూడా సక్సెస్ అయ్యాడు విశ్వక్ సేన్. ప్రస్తుతం వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు విశ్వక్ సేన్. అశోక వనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా, రీసెంట్ గా ధమ్కీ ఇలా డీసెంట్ హిట్ లను అందుకొని దూసుకుపోతున్నాడు. ధమ్కీ సినిమా ఉగాది పండుగ నాడు రిలీజ్ అయి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. విశ్వక్ సేన్ నటన, కథ, పాటలు అన్నీ నచ్చడంతో ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా ఎక్కడా తగ్గట్లేదు. విశ్వక్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను అందించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఈసినిమా హక్కులను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలోనే తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఈసినిమాను ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. మరి ఈసినిమాను థియేటర్లలో చూడటం మిస్ అయిన వారు ఓటీటీ లో చూడొచ్చు..
కాగా ఈసినిమాలో నివేదా పేతురాజు హీరోయిన్ గా నటించగా ఇంకా ఈ సినిమాలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర పాత్రల్లో నటించారు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మించిన ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ అందించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: