ఓటీటీ లోకి వచ్చేసిన రంగమార్తాండ

rangamarthanda movie now streaming on this ott platform

కంటెంట్ ఒరియెంటెడ్ సినిమాలను ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ఇక ఈవిషయం మరోసారి నిరూపించారు. ఈమధ్య కాలంలో అలా వచ్చిన సినిమాల్లో రంగమార్తాండ ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా గత నెలలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈసినిమా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. ఈసినిమా ద్వారా ల్లితండ్రులు బాగున్నప్పుడే వారిని చూసుకోవాలని మెసేజ్ ను ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈసినిమా హక్కులను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో ఈసినిమా అమెజాన్ లో నేటి నుండి స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ ఎమోషనల్ రైడ్ ను థియేటర్లలో చూడటం మిస్ అయిన వారు ఓటీటీ లో చూడొచ్చు..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కథ విషయానికి వస్తే రాఘవరావు తన స్నేహితుడు చక్రపాణి తో కలిసి రంగస్థలంపై ఎన్నో నాటకాలు వేసి రంగమార్తాండ అనే బిరుదును సైతం అందుకుంటాడు. తమ నటనతో ప్రేక్షకుల నీరాజనాలు సైతం అందుకుంటారు. అలాంటి రంగస్థల నటుడు నాటకరంగం నుండి తప్పుకొని తనకు ఉన్నదంతా వారసులకు ఇచ్చేస్తాడు. ఇక ఆ తరువాత నుండి మరో అంకం మొదలవుతుంది. కన్నవారి నుండే రాఘవరావుకు ఎలాంటి సమస్యలు తలెత్తాయి.. ఎలాంటి అనుభవాలు తలెత్తాయి.. అనేదే ఈ సినిమా కథ

కాగా ఈసినిమాలో ప్ర‌కాశ్ రాజ్‌,బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక రాజ‌శేఖ‌ర్, రాహుల్ సిప్లిగంజ్ ఇత‌ర నటీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =