విభిన్నమైన చిత్రాలు తీసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా హనుమాన్. `హనుమాన్` ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పురాణాల్లోని హనుమంతుని కథ స్పూర్తితో సూపర్ హీరోస్ నేపథ్యంలో సోషియో ఫాంటసీగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా.. టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. రీసెంట్ గానే శ్రీ రామ నవమి పండుగ నేపథ్యంలోనే హానుమాన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ రోజున హనుమాన్ జయంతి కావడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ‘హనుమాన్ చాలీసా’ను రిలీజ్ చేశారు మేకర్స్. హనుమాన్ చాలీసాపై, హనుమాన్ కి సంబంధించిన యానిమేషన్ విజువల్స్ ను కట్ చేశారు. యానిమేషన్ తో కూడిన ఈ హనుమాన్ చాలీసా ఆకట్టుకునేలా ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: