విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. భారతీయుడు సినిమాకు ఈసినిమా సీక్వెల్.ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఒకవైపు రామ్ చరణ్ తో సినిమాను పూర్తి చేస్తూనే మరోపక్క ఇండియన్ 2 సినిమాను కూడా పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది ఈసినిమా. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న శంకర్ ఈసినిమా గురించి మాట్లాడుతూ.. ఈసినిమా షూటింగ్ జూన్ వరకూ పూర్తవుతుందని తెలిపాడు. మిగిలిన షూటింగ్ ను తైవాన్ ఇంకా సౌత్ ఆఫ్రికాలో జరగనుందని.. ముందు తైవాన్ లో కొద్దిరోజులు షూటింగ్ ను జరుపుకున్న తరువాత సౌత్ ఆఫ్రికా వెళ్లనున్నారు.. జూన్ వరకూ షూటింగ్ పూర్తిచేసి ఈ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు, విఎఫ్ఎక్స్ పై ఫోకస్ చేయనున్నట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. సిద్ధార్థ్, గుల్షన్ గ్రోవర్, నెదురుమూడి వేణు, సముద్రఖని, బాబీ సింహ, గురు సోమసుందరం, ఢిల్లీ గణేష్, జయ ప్రకాష్, మారి ముత్తు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు. ఈసినిమాను దీపావళి పండుగ సందర్బంగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: