ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డ్ రావడంతో భారతీయ సినీ పరిశ్రమ స్థాయి మరో మెట్టు పైకి ఎక్కింది. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతో మందికి స్పూర్తి గా నిలిచింది. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈసినిమా ఇక్కడ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక్కడ మాత్రమే కాదు వేరే భాషల్లో కూడా ఈసినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ముఖ్యంగా జపాన్ లో అయితే కొత్త రికార్జులు క్రియేట్ చేసింది. ఇక ఈసినిమాకు ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక అందరూ ఎదురుచూసిన నాటు నాటు సాంగ్ కు కూడా ఆస్కార్ అవార్డు వరించడంతో ఇండియన్ సినిమా మొత్తానికి దక్కినట్టుగా అందరూ భావిస్తూ ప్రశంసిస్తున్నారు. ఇండియన్ సెలబ్రిటీలు అందరూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అభినందలు తెలియచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ప్రభుదేవా కూడా తనదైన స్టయిల్లో ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. స్టూడియోలో వంద మందితో కూడిన తన బృందంతో ప్రభుదేవా నాటునాటు హుక్ స్టెప్పులు వేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఆర్ఆర్ఆర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుదేవా ఆయన బృందం చేసిన నాటు నాటు స్టెప్పు వీడియో వైరల్ అవుతోంది. ఇక దీనిపై ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం కూడా స్పందిస్తూ థ్యాంక్యూ లెజెండ్ అని ట్వీట్ చేసింది.
NAATU NAATU ❤️❤️❤️❤️❤️to the TEAM 🙏 pic.twitter.com/g58cQlubCp
— Prabhudheva (@PDdancing) March 18, 2023
ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటించింది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి, రాహుల్ రామకృష్ణ నటించారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మించగా. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: