హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ అద్భుత రెస్పాన్స్ సాధించిన విషయం తెలిసిందే. కాంతార మూవీ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీపై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. కాంతార మూవీకి ఓటీటీ లో కూడా అద్భుత స్పందన లభిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాంతార మూవీ రెండు ఇంటర్నేషనల్ భాషలలో రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ సోషల్ మీడియా లో అనౌన్స్ చేసింది. ఇటాలియన్, స్పానిష్ భాషలలో ఈ సినిమాని డబ్బింగ్ చేసి రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం డబ్బింగ్ వర్క్స్ జరుగుతున్నాయని తెలిపింది. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమాలు రిలీజ్ కావడం అంటే గ్రేట్ అచీవ్ మెంట్ గా భావించాలి. ఇప్పటికే జపాన్ భాషలో ఆర్ఆర్ఆర్ ఏ స్థాయిలో రికార్డులు సృష్టిస్తుందో తెలిసిందే. అలాగే గతంలో అమీర్ ఖాన్ దంగల్ మూవీ చైనీస్ భాషలో భారీగా కలెక్షన్స్ ని రాబట్టింది. ఇప్పుడు కాంతార కూడా అలాంటి ఫీట్ ని ఇటాలియన్ స్పానిష్ భాషలలో క్రియేట్ చేస్తుందేమో వేచి చూడాల్సిందే.
Siamo lieti di annunciare che, grazie all’enorme richiesta del pubblico internazionale, stiamo editando il film Kantara anche in lingua italiana e spagnola.#Kantara @shetty_rishab #VijayKiragandur @hombalefilms @gowda_sapthami @AJANEESHB @actorkishore @HombaleGroup @KantaraFilm pic.twitter.com/Bs0EGu33V8
— Hombale Films (@hombalefilms) March 18, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: