టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. గత ఏడాది కార్తికేయ 2, 18 పేజేస్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీటిలో కార్తికేయ 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. మనం ఎలా బతకాలో శ్రీకృష్ణుడు చెప్పిన విధానాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు చందూ. హిందీలో కూడా ఈసినిమా సూపర్ హిట్ తో దూసుకుపోయింది. దీంతో ఈసినిమా పాన్ ఇండియా స్టార్‌గా నిఖిల్ ను నిలబెట్టింది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా వల్ల నిఖిల్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ 2023లో నిఖిల్ సిద్ధార్థ పాపులర్ ఛాయిస్‌లో ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. ఇక నిఖిల్ కు ఈ అవార్డ్ రావడంపై చిత్రయూనిట్ తో పాటు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కార్తికేయ2 తరువాత నిఖిల్ 18 పేజెస్ తో మరో డీసెంట్ ను అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో బిజీగా ఉన్నాడు. గారీ బి.హెచ్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఈసినిమా స్పై. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. కాగా ఈసినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆర్యన్ రాజేష్ కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నాడు. దర్శకత్వంతో పాటు గారీ ఈసినిమాకు ఎడిటర్ గా కూడా వ్యవహరించనున్నాడు. ఇంకా ఈసినిమాను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో రూపొందించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: