యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి దానికి కారణం ఏంటంటే ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటించిన బిగ్ బడ్జెట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు ను గెలుచుకోవడమే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ దక్కించుకుంది. ఈ అవార్డుల వేడుక ఈరోజు లాస్ ఏంజెల్స్ లో అట్టహాసంగా జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గేయ రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణి ఈపాటకు గాను అవార్డు అందుకున్నారు. ఈ వేడుకకు వీరితో పాటు ఎన్టీఆర్ మరియు ఆర్ఆర్ఆర్ టీం కూడా హాజరైయ్యారు. ఇక ఈ సందర్భంగా ఎన్టీఆర్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. తన తదుపరి చిత్రం ఎన్టీఆర్ 30(వర్కింగ్ టైటిల్) గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ తరువాత నేను నా 30 వ చిత్రంలో నటించనున్నాను. నా స్నేహితుడు కొరటాల శివ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నారు. ఈనెల 29నుండి షూటింగ్ లో పాల్గొంటాను. ఆర్ఆర్ఆర్ లాగే ఈ సినిమా కూడా మిమ్మల్ని ఎక్సయిట్ చేస్తుందని నమ్ముతున్నాని అన్నారు.
#NTR30 Shoot Starts from MARCH 29🔥
Man of Masses #JrNTR shares the much awaited update about his next film while heading to #Oscars!!💥@tarak9999 #RRRMovie #Oscars95 #TeluguFilmNagar pic.twitter.com/lz9cnnD8mU— Telugu FilmNagar (@telugufilmnagar) March 13, 2023
ఇక ఈచిత్రం ఈనెల 18న లాంచ్ కానుంది. పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుంది. తెలుగులో ఆమెకు ఇదే మొదటి సినిమా కానుంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్షకులముందుకు రానుంది .
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.