మురళీ గంధం దర్శకత్వంలో సాయి రోనక్, అవికా గోర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా పాప్ కార్న్. లిఫ్ట్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమాలో అవికా హీరోయిన్ గా నటించడంతో పాటు నిర్మాణంలోనూ భాగస్వామ్యమయ్యారు. ఇక నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. సాయి రోనక్, అవికా గోర్, చారు హాసన్ తదితరులు
దర్శకత్వం..మురళీ గంధం
సమర్పణ.. ఎం.ఎస్.చలపతి రాజు
బ్యానర్స్.. ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్స్
నిర్మాతలు.. బోగేంద్ర గుప్తా
సినిమాటోగ్రఫి.. ఎం.ఎన్. బాల్ రెడ్డి
సంగీతం.. శ్రావణ్ భరద్వాజ్
కథ..
సమీరణ (ఆవికా గోర్) తాను చాలా అందంగా ఉంటుందని ఫీలవుతూ ఉంటుంది. ఇక పవన్ (సాయిరోనక్) మ్యుజీషియన్. తన తాతయ్య కలను నెరవేర్చాలని చూస్తుంటాడు. ఇక ఒకరోజు షాపింగ్ మాల్ కు వెళ్లిన వీరిద్దరూ అక్కడ లిఫ్ట్ లో ఇరుక్కుంటరు. మరోవైపు ఆ మాల్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కారణంగా మాల్ నుంచి జనాలు పారిపోవడం, పోలీసులు ఆ మాల్ ను సీజ్ చేస్తారు. మరి వీరిద్దరూ ఆ లిఫ్ట్ లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు ? ఎలా బయటపడ్డారు? అనేది మిగిలిన కథ..
విశ్లేషణ..
ఒకే ఇన్సిడెంట్ తో ఇప్పటివరకూ చాలా సినిమాలే వచ్చాయి. అయితే అలాంటి కథాంశంతో రెండు గంటలకు పైగా సినిమాను నడిపించడం అనేది కూడా చాలా కష్టం. పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ఉంటేనే తప్పా వర్కవుట్ కావు. ఇక లిఫ్ట్ నేపథ్యంలో వచ్చిన కథలు తక్కువే. ఆ మధ్య అనసూయ ప్రధాన పాత్రలో వచ్చిన థాంక్ యు బ్రదర్ సినిమా వచ్చింది. ఇక ఇప్పుడు ఈసినిమాపై కూడా బాగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఒక అమ్మాయి, అబ్బాయి ఒక లిఫ్ట్ లో ఒక రోజు చిక్కుకుంటే ఏమి జరుగుతుంది, ఎలా ఆ లిఫ్ట్ లో ఇద్దరూ బయటనుండి సహాయం లేకుండా వున్నారు అన్న కథాంశంతో ఈసినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్. హీరో హీరోయిన్లు లిఫ్టులో ఇరుక్కుపోవడమనే కాన్సెప్ట్ బావుంది. డైరెక్టర్ తన మేకింగ్ తో బాగానే ఆకట్టుకున్నాడు.
పెర్ఫామెన్స్..
ఈసినిమాలో హీరో హీరోయిన్లు తప్పా మిగిలిన నటీనటులు కనిపించేది చాలా తక్కువే. అవికా గోర్ ఎప్పటిలాగే తన చలాకీ నటనతో ఆకట్టుకుంది. ఇక చివర్లో వచ్చే ఎమోషనల్ సీన్లలో కూడా బాగా నటించింది. హీరోగా నటించిన సాయి రోనక్ తన లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా తన పాత్ర మేర సెటిల్డ్ గా బాగానే నటించాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ వాల్యూస్..
ఈసినిమాలో ముందుగా మెచ్చుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ బాల్ రెడ్డి గురించి. గంటన్నరకు పైగా సినిమా మొత్తం లిఫ్ట్ లోనే ఉంటుంది. అయినా కూడా ఉన్న స్పేస్ లో మంచి విజువల్స్ అందించాడు. ఇక శ్రావణ్ భరద్వాజ్ అందించిన సంగీతం కూడా ప్లజంట్ గా ఉంది. పాటల సంగతి పక్కన పెడితే బీజియం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు నచ్చే వారికి ఈసినిమా బాగానే నచ్చుతుంది. అన్ని వర్గాల వారు ఈసినిమాను ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.