స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం విభిన్నమైన సినిమాలు చేయడానికి ఇప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంది. అంతేకాదు వరుస విజయాలను సైతం అందుకుంటూ వెళుతుంది. రీసెంట్ గానే యశోద లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ తో అలరించిన సమంత ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తుంది. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. మహాభారతంలోని ఆది పర్వం.. అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా సినిమా తెరకెక్కుతుంది. ఇక షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మరోవైపు జరుపుతున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. ఇక ఈసినిమా నుండి అప్ డేట్ ఇవ్వనున్నట్టు న్యూఇయర్ సందర్భంగా చిత్రయూనిట్ తెలిపిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఈసినిమా రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించారు మేకర్స్. ఈసినిమాను ఫిబ్రవరి 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 3డీ లో కూడా ఈసినిమాన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
Witness the #EpicLoveStory #Shaakuntalam in theatres near you from Feb 17th 2023 Worldwide! Also in 3D 🦢@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan #ManiSharma @neelima_guna @GunaaTeamworks @SVC_official @neeta_lulla @tipsofficial #MythologyforMilennials #ShaakuntalamOnFeb17 pic.twitter.com/El9INBB4gg
— Gunaa Teamworks (@GunaaTeamworks) January 2, 2023
కాగా ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా.. అదితి బాలన్ అనసూయగా, మోహన్ బాబు మహర్షి, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. శేఖర్ వి జోసెఫ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమాను మొత్తం 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: