న్యూ ఇయర్ లో రవితేజ ఎమోషనల్ పోస్ట్

Ravi Teja Dedicated Dhamaka Success to Fans and Public,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Ravi Teja,Sreeleela,Dhamaka,Dhamaka Movie,Dhamaka Telugu Movie,Dhamaka Success to Fans and Public,Ravi Teja About Dhamaka Success to Fans and Public,Dhamaka Success,Dhamaka Movie Success,Dhamaka Telugu Movie Success

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రావు రమేశ్, జయరాం, తనికెళ్ల భరణి, ప్రవీణ్, సచిన్ ఖేద్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించారు. ధమాకా మూవీకి థియేటర్లలో మంచి స్పందన లభిస్తుంది. ధమాకా మూవీలో హీరో రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్, గ్లామర్ డాల్ శ్రీలీల డ్యాన్స్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ధమాకా మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్ళు సాధిస్తూ దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ లో కూడా సూపర్ రన్ తో దూసుకెళ్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అద్భుత ప్రేక్షకాదరణతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న మాస్ ఎంటర్ టైనర్ ధమాకా మూవీ 4 రోజులలోనే బ్రేక్ ఈవెన్ సాధించింది  ఈ మూవీ 10 రోజులకు ప్రపంచవ్యాప్తంగా 89 కోట్ల వసూళ్ళతో దూసుకుపోతోంది. ధమాకా మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న హీరో రవితేజ సోషల్ మీడియా లో ఒక ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసారు. ధమాకా సక్సెస్ ని తనకి ఒక మర్చిపోలేని ఆనందం కలిగించిందనీ, అలాగే ఈ సినిమా విజయాన్ని గత ఏడాదిలో మనం కోల్పోయిన దిగ్గజాలకు అంకితం చేస్తున్నాననీ, ఈ ఏడాది మరింత ఉత్సాహంగా చేద్దాం అంటూ తన ఫ్యాన్స్ కు హామీ ఇస్తూ ట్వీట్ చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =