ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ రివ్యూ

itlu maredumilli prajaneekam movie review

అల్లరి నరేష్ హీరోగా ఏఆర్ మోహన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. నాంది సినిమా తరువాత నరేష్ హీరోగా వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈసినిమా టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. మరి భారీ ఎక్స్ పెక్టేషన్స్ నేపథ్యంలో ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉంది.. నరేష్ కు మరో హిట్ ను అందించిందా లేదా అన్న విషయం తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్‌, చ‌మ్మ‌క్ చంద్ర, సంపత్ రాజ్, శ్రీతేజ్, కామాక్షి భాస్కర్ల, కుమనన్ సేతురామన్ తదితరులు
దర్శకత్వం.. ఏ ఆర్ మోహన్
బ్యానర్స్.. హాస్య మూవీస్‌ బ్యానర్‌
నిర్మాతలు.. రాజేష్ దండ
సినిమాటోగ్రఫి.. రామ్ రెడ్డి
సంగీతం.. శ్రీ చ‌ర‌ణ్ పాకాల

కథ..

శ్రీపాద శ్రీనివాస్ (అల్లరి నరేష్) టీచర్ గా పనిచేస్తుంటాడు. ఇక అతనికి ఎలక్షన్స్ నేపథ్యంలో ఎలక్షన్ డ్యూటీ పడుతుంది. దాంతో డ్యూటీ పై మారేడుమిల్లి గ్రామానికి చేరుకుంటాడు. అయితే అది గిరిజన ప్రాంతం.. అడవుల్లో ఉండే ప్రాంతంకాబట్టి పెద్దగా ఎవరికి తెలియదు. వసతులు కూడా ఏం ఉండవు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఈనేపథ్యంలో గిరిజన గ్రామాల ప్రజలు తమ కష్టాలు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని… అందుకని ఓటు వేయడానికి నిరాకరిస్తారు. మరోవైపు నరేష్ కూడా వారి కష్టాలను బయట ప్రపంచానికి తెలియజేయాలని అనుకుంటాడు. దానికోసం నరేష్ పోరాటం కూడా మొదలుపెడతాడు. అప్పుడే సినిమా కథలో ఊహించని మలుపులు వస్తాయి. ఇక గ్రామ ప్రజల కోసం నరేష్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు..? చివరికి తాను అనుకున్నది సాధించాడా లేదా..? అన్నది ఈ సినిమా కథ.

విశ్లేషణ

ఈసినిమా కూడా పొలిటికల్ బ్యాక్ గ్రాప్ లో తెరకెక్కించినట్టు అర్థమవుతుంది. రాజకీయ నాయకులు ప్రజలను ఓట్ల కోసం ఏ విధంగా వాడుకుంటారు.. ఆ తరువాత వారి సమస్యలను ఎలా గాలికి వదిలేస్తారు అన్న కథాంశంతో ఈసినిమా కథను రాసుకున్నాడు డైరెక్టర్. అటవీ ప్రాంతంలోని ప్రజలు తమకు కనీస అవసరాలు అయిన విద్య, వైద్యం, రవాణా వంటివి కోరుతూ ఏళ్ల తరబడి ప్రభుత్వాధికారుల చుట్టూ తిరిగి విసిగి వేసారి ఆ ప్రభుత్వాధికారులనే నిర్బంధిస్తే ఎలా ఉంటుంది? అనేది చూపించాడు. సినిమాలో ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా దర్శకుడు తన చెప్పాలనుకున్నది నేరుగా చెప్పాడు. తీసుకున్నది చిన్న పాయింట్ అయినా ఎక్కడికక్కడ ట్విస్టులతో కూడి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఆ కథను మలిచారు.

పెర్ఫామెన్స్

అల్లరి సినిమాతో తన ఇంటిపేరును అల్లరి గా మార్చుకొని అల్లరి నరేష్ అని పేరుతెచ్చుకున్నాడు. ఆ తరువాత ఒకటీ రెండూ తప్పా.. అన్నీ కామెడీ ఎంటర్ టైన్ మెంట్లతోనే అలరిస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు తన రూట్ ను మార్చాడు. ఈమధ్య కాలంలో వచ్చిన నాంది సినిమాతో నా కొత్త సినిమా ప్రయాణానికి నాంది పలికాడు. నాంది సినిమాతో నరేష్ కు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఇప్పుడు మరోసారి ఇట్లు మారేడుమిల్లీ ప్రజానీకం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఇక నరేష్ నటన గురించి మనకు తెలియంది కాదు. కామెడీ సినిమాలతో ఎలా నవ్వించగలడో.. ఎమోషన్ ను కూడా అలానే చూపించగలడు. ఇక ఈసినిమాలో కూడా స్కూల్ టీచర్ గా ఎలక్షన్ ఆఫీసర్ గా నరేష్ తన పాత్రలో ఒదిగిపోయాడు. నటుడిగా మరోసారి సీరియస్ రోల్స్ కూడా చేయగలనని ప్రూవ్ చేశారు. హీరోయిన్ గా చేసిన ఆనంది మరోసారి తన సహజమైన నటనతో ఆకట్టుకుంది. ఇక ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్, రఘుబాబు తమ కామెడీతో బాగానే నవ్వించారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర బాగానే నటించారు

టెక్నికల్..

టెక్నికల్ విభాగానికి వస్తే డైరెక్టర్ ఈ సినిమా కథను బాగానే ప్రజెంట్ చేశాడు. మ్యూజిక్ కూడా బాగానే ఉంది. సినిమాటోగ్రాఫీ కూడా బాగానే ఉంది. అడవిలోని విజువల్స్ ను బాగా చూపించారు. ఇక నిర్మాణ విలువలు కూడా రిచ్ గా ఉన్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా కూడా సందేశాత్మకమైన సినిమా అని చెప్పొచ్చు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ నాయకులు, అధికారులకు ప్రజలు గుర్తుకు వస్తారని… ఆ తర్వాత వాళ్ళ సమస్యలు పట్టించుకోరని ఈసినిమా ద్వారా మరోసారిచూపించారు. ఈ సినిమాను ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here