మేర్లపాక గాంధీ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన సినిమా లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ . కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈసినిమా టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. మరి నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మాజీ, సుదర్శన్, సప్తగిరి, మైమ్ గోపి తదితరులు
దర్శకత్వం.. మేర్లపాక గాంధీ
బ్యానర్స్.. నిహారికా ఎంటర్‌టైన్ మెంట్-ఆముక్త క్రియేషన్స్
నిర్మాతలు.. వెంకట్ బోయినపల్లి
సంగీతం..ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిరియాల
సినిమాటోగ్రఫి.. ఏ.వసంత్
కథ
అది 1990 కాలం.. అక్రమ మైనింగ్ చేస్తున్న ఓ నాయకుడిని పీపీఎఫ్ (పీపుల్ ప్రొటక్షన్ ఫోర్స్) కాల్చి చంపుతుంది. దాంతో ప్రభుత్వం ‘పీపుల్ ప్రొటక్షన్ ఫోర్స్’ నాయకులని శాంతి చర్చలకు పిలుస్తుంది ప్రభుత్వం. కానీ శాంతి చర్చలకు వెళ్ళిన ముగ్గురు పీపీఎఫ్ నాయకులు కనిపించకుండాపోతారు. దీని వెనుక డీజీపీ హస్తం వుందని పీపీఎఫ్ నాయకుడు గోపన్న భావిస్తాడు. డిజీపీని చంపడానికి ప్లాన్స్ వేస్తుంటాడు. కట్ చేస్తే 2022 కాలం.. మరోవైపు విప్లవ్ (సంతోష్ శోభన్) ఓ యూట్యూబర్. ఎలాగైనా సరే పెద్ద యూట్యుబర్ అవ్వాలని అనుకుంటాడు. కానీ అతని ఛానల్ కి మాత్రం సబ్ స్క్రైబర్ ఉండరు. ముప్పై మందే సబ్‌స్క్రైబర్స్ ఉంటారు. అది కూడా వాళ్లు వేరే వాళ్ల ఫొన్లు తీసుకొని బలవంతంగా చేసినవే. ఇక ఈనేపథ్యంలో ట్రావెలింగ్ వ్లోగ్ చేద్దామని జాక్ డేనియల్స్ (సుదర్శన్ ) అనే డీవోపీని వెంటబెట్టుకొని అరుకు వెళ్తాడు. అయితే అక్కడ వసుధ (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడిపోతాడు. ఈ క్రమంలో పీపీఎఫ్ గ్యాంగ్ కి చిక్కుతారు ఈ ముగ్గురు. వసుధ డీజీపీ కూతురని తెలుసుకున్న పీపీఎఫ్ నాయకుడు గోపన్న ఏం చేశాడు ? పీపీఎఫ్ నాయకుల్లో కనిపించకుండాపోయిన ముగ్గురు ఏమయ్యారు ? చివరికి విప్లవ్, వసుధ అడవి నుంచి ఎలా బయటపడ్డారనేది మిగతా కథ.
విశ్లేషణ
మేర్లపాక గాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తను చేసిన సినిమాలు చూస్తే చాలు తన కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో. తను తీసిన కామెడీ ఎంటర్ టైనర్ లు వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా మంచి హిట్ లను సొంతం చేసుకున్నాయి. నానితో తీసిన కృష్ణార్జున యుద్ధం హిట్ కాలేదు కానీ కామెడీ మాత్రం బాగానే ఉంటుంది. ఇక ఈమధ్యకాలంలో మాస్ట్రో, ఎక్ మినీ కథ సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు మరో కామెడీ ఎంటర్ టైనర్ తో వచ్చాడు. ‘పీపుల్ ప్రొటక్షన్ ఫోర్స్’ నిజానికి ఇది సీరియస్ టాపిక్ అని చెప్పొచ్చు. దానికి కామెడీ టచ్ ఇచ్చాడు. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ యూ ట్యూబ్ ను క్రియేట్ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో దాన్ని పాయింట్ గా తీసుకుని సినిమాగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు గాంధీ. సినిమా మొత్తం కూడా ఫన్ ఎంటర్టైనర్ గా రూపొందించారు.
పెర్ఫామెన్స్
ఇక నటీనటుల నటన విషయానికొస్తే సంతోష్ నటన ఇంతకుముందు సినిమాల్లోనే చూసేశాం. ఈసినిమాలో కూడా తన నటనతో బాగా ఆకట్టుకున్నాడు. తన వేరియేషన్స్ అద్భుతంగా చూపించాడు. యూ ట్యూబర్ గా వ్యూస్, లైక్స్ కోసం అతడు పడే తాపత్రయం నవ్విస్తుంది. ఫరియా అబ్దుల్లా కూడా ఈసినిమాకి మరో ప్లస్ పాయింట్. ఫరియా అబ్దుల్లా తనదైన కామెడీతో నవ్వులు పూయించింది. మరోసారి తన పాత్రతో నటిగా నిరూపించుకుంది. ఇక ఈసినిమాకి మరో ప్రధాన బలం బ్రహ్మాజీ. బ్రహ్మాజీ పాత్ర కూడా బాగా ఆకట్టుకుంటుంది. పీపీఎఫ్ దళం బహిష్కరించిన బ్రహ్మాన్నగా తనేంటో నిరూపించుకునే క్రమంలో బ్రహ్మాజీ చేసిన సీరియస్ కామెడీ ప్రేక్షకులను నవ్వులు తెప్పిస్తుంది. ఇక హీరో పక్కనే ఉంటూ సుదర్శన్ చేసిన కామెడీ కూడా బాగానే ఆకట్టుకుంటుంది. సప్తగిరిది చిన్న పాత్రే అయినా తన టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు.
టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే.. ఈసినిమాకు ప్రవీణ్ లక్కరాజు – రామ్ మిరియాల సంగీతం అందించారు. సంగీతం ఆకట్టుకుంది, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. వసంత్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే ప్రేక్షకులను మాత్రం ఎంటర్టైన్ చేయడంలో ఈసినిమా సక్సెస్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: