టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన విజయాలు చూస్తేనే అర్థమవుతుంది తన కథల ఎంపిక ఎలా ఉంటుందో. క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్ ఇలా వరుసగా విభిన్నమైన కథలతో, వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు మరో హిట్ ను తన ఖాతాలో వేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. అడివి శేష్ నుండి రాబోతున్న సినిమా హిట్ 2. శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన సినిమా హిట్. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు దాని సీక్వెల్ హిట్ 2 రాబోతుంది. ఇక మొదటి సినిమా హిట్ అవ్వడంతో ఈసినిమా పై భారీగానే అంచనాలు ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెడుతున్నారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. నవంబర్ 3వ తేదీన ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇక తజాగా టైమ్ ను కూడా ఫిక్స్ చేశారు. నవంబర్ 3వ తేదీన ఉదయం 11.07 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు.
కాగా ఈసినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటించనుంది. ఈ సినిమాలో ఆర్య అనే పాత్రలో మీనాక్షి నటిస్తోంది. ఇక విలక్షణ నటుడు రావు రమేష్ కూడా నటిస్తున్నాడు. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నాగేశ్వర్రావు పాత్రలో నటిస్తున్నాడు. నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని ఈసినిమాను నిర్మిస్తున్నారు. మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్ స్టీవర్ట్ ఎడురి సంగీతాన్ని అందించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: