టాలీవుడ్ లో ఉన్న టాప్ ప్రొడక్షన్ సంస్థల్లో గీతా ఆర్స్ట్ కూడా ఒకటి. ఎన్నో ఏళ్ల నుండి ఈ సంస్థ టాప్ లోనే కొనసాగుతూ వస్తుంది. దానికి కారణం ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గీతా ఆర్స్ట్ అధినేత అల్లు అరవింద్ కు సినిమాలపై ఉన్న పట్టు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అల్లు అరవింద్ నుండి సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ అని చెప్పొచ్చు. అలా గీతా ఆర్స్ట్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇక డైరెక్ట్ గా తెలుగు సినిమాలను నిర్మించడంతో పాటు డబ్బింగ్ సినిమాలను కూడా రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గానే కన్నడలో సూపర్ హిట్ అయిన కాంతార సినిమా హక్కులను సొంతం చేసుకొని తెలుగు లో రిలీజ్ చేయగా ఇక్కడ కూడా ఈసినిమా సూపర్ హిట్ అయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాను కూడా రిలీజ్ చేయడానికి సిద్దం అవుతుంది. వరుణ్ ధావన్ హీరోగా వస్తున్న సినిమా భేడియా. హిందీ, తమిళం అలాగే తెలుగులో పాన్ ఇండియా తరహాలో నవంబర్ 25 న 3D వెర్షన్ లో రిలీజ్ కానుంది. తెలుగులో ఈ సినిమాను తోడేలు టైటిల్ తో విడుదల చేస్తున్నారు. ఇక ఈసినిమాను అల్లు అరవింద్ “గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్” ద్వారా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు.
కాగా అమర్ కౌశిక్ దర్శకత్వంలో హారర్ కామెడీ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. ఇక సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఇటీవల రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ ను మాత్రం సొంతం చేసుకుంది. మరి ఈసినిమా ఎంత విజయాన్ని అందిస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: