ఫుల్ బాటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్

Satyadevs Full Bottle first look released, Full Bottle First Look Out Now, Full Bottle Movie First Look Out Now, Satya Dev’s Upcoming Movie Full Bottle, Satya Dev, Sanjana Anand, Sharan Koppisetty, Satya Dev Latest Movie, Satya Dev's Upcoming Movie, Full Bottle, Full Bottle Movie, Full Bottle Update, Full Bottle New Update, Full Bottle Latest Update, Full Bottle Movie Updates, Full Bottle Telugu Movie, Full Bottle Telugu Movie Latest News, Full Bottle Telugu Movie Live Updates, Full Bottle Telugu Movie New Update, Full Bottle Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

పాత్ర ఏదైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేసి మరీ నటించే నటుల్లో టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ కూడా ఎప్పుడూ ముందుంటాడు. ఒక పక్క హీరో పాత్రలు చేస్తూనే మరోపక్క పలు సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తున్నాడు. ఇటీవలే గాడ్ ఫాదర్ లో చేసిన తనపాత్రకు ఎలాంటి ప్రశంసలు దక్కాయో తెలిసిందే. అలానే బాలీవుడ్ లో రామ సేతు సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటించగా అది రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈసినిమాలో సత్యదేవ్ పాత్రకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ లపై దృష్టి పెడుతున్నాడు. ఈనేపథ్యంలో ఫుల్ బాటిల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటుంది. ఇక తాజాగా నేడు ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాలో సత్యదేవ్‌ మెర్క్యూరి సూరిగా కనిపించనున్నాడు. ఫస్ట్ లుక్‌ మాత్రం డిఫరెంట్‌గా ఉండి ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్ ను బట్టి సత్యదేవ్ మరో విభిన్నమైన పాత్రలో వస్తున్నట్టు అర్థమవుతుంది.

కాగా ఈసినిమాతో నిర్మాతగా కూడా మారుతున్నాడు సత్యదేవ్. ఎంటర్ టైన్ మెంట్ నేపథ్యంలో ఎస్‌డీ కంపెనీ, శర్వంత్రమ్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌లపై రామాంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సత్యదేవ్‌కు జోడీగా సంజనా ఆనంద్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో తిమ్మరుసు సినిమా రాగా ఆసినిమా మంచి హిట్ కొట్టింది. మరి ఈసినిమాతో వీరిద్దరి మరో హిట్ ను కొడతారా..? నిర్మాతగా సత్యదేవ్ ఎంత వరకూ సక్సెస్ అవుతాడో తెలియాలంటే మాత్రం కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − fourteen =