విశ్వక్ సేన్ హీరోగా నటించిన హిట్ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు ఈసినిమా సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసీక్వెల్ అడివి శేష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ హిట్ 2 సినిమా లో కేడీ అనే పోలీసు అధికారిగా అడివి శేష్ కనిపించనున్నాడు. ఈసినిమాను మల్టీ స్టేట్స్‌లో కేసులు సాల్వ్ చేసే విధంగా హిట్ యూనివర్స్‌ను ప్లాన్ చేసినట్టు కూడా శైలేష్ ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చాడు. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టేశారు మేకర్స్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈసినిమా నవంబర్ 3వ తేదీన ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనన్నట్టు ప్రకటించారు. ఇప్పుడు తాజాగా ఈసినిమాలో నటిస్తున్న పాత్రలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు. ఈసినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా తన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో ఆర్య అనే పాత్రలో మీనాక్షి నటిస్తోంది. ఈ సందర్భంగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక విలక్షణ నటుడు రావు రమేష్ పాత్రను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. రావు రమేష్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నాగేశ్వర్రావు పాత్రలో నటిస్తున్నట్టు పోస్టర్ ద్వారా తెలియజేశారు.
Introducing the ravishing @Meenakshiioffl as ‘Aarya’ from the riveting world of #HIT2 ❤️🔥
Teaser out on NOV 3rd
– https://t.co/Q8PguX0xw3#HIT2onDec2@AdiviSesh @NameisNani @KolanuSailesh #PrashantiTipirneni @Garrybh88 @maniDop #JohnStewartEduri @walpostercinema @saregamasouth pic.twitter.com/cd9OmOlfsf— Sailesh Kolanu (@KolanuSailesh) November 1, 2022
కాగా థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈసినిమాలో కోమలి ప్రసాద్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంతి తిపిరినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్ స్టీవర్ట్ ఎడురి సంగీతాన్ని అందించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 2న రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: