బ్రిటన్ డిప్యూటీ కమిషనర్ తో చిరు

chiranjeevi dinner with british commissioner gareth wynn owen, Chiranjeevi Meets British Delegate, Chiranjeevi met Gareth Wynn Owen, British Delegate Gareth Wynn Owen, British deputy commissioner Gareth Wynn Owen, Chiranjeevi, Ravi Teja, Shruti Haasan, Catherine Tresa, KS Ravindra, Mega Star Chiranjeevi, Chiranjeevi Latest Movie, Chiranjeevi's Upcoming Movie, Waltair Veerayya Movie, Waltair Veerayya Update, Waltair Veerayya New Update, Waltair Veerayya Latest Update, Waltair Veerayya Movie Updates, Waltair Veerayya Telugu Movie, Waltair Veerayya Telugu Movie Latest News, Waltair Veerayya Telugu Movie Live Updates, Waltair Veerayya Telugu Movie New Update, Waltair Veerayya Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నూతన బ్రిటన్ డిప్యూటీ కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ఎన్నికయ్యారు. ఇప్పటివరకూ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గా విధులు నిర్వహించారు. ఆయన పదవీకాలం జులైలో ముగియగా, ఆయన స్థానంలో గారెత్ విన్ ఓవెన్ నూతన బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గా నియమితులయ్యారు. ఇక ఈనేపథ్యంలో నేడు మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. చిరంజీవి తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈవిషయాన్ని చిరంజీవి స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. బ్రిటన్ నూతన డిప్యూటీ కమిషనర్ ను మీట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ సమావేశంలో బ్రిటన్, భారత్, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అనేక అంశాలపై చర్చించుకున్నాం. అనంతరం ఆయనకు కొన్ని తెలుగు సంప్రదాయ వంటకాలతో విందు ఏర్పాటు చేశాను. ముఖ్యంగా స్పైసీ ఆవకాయను మరిచిపోలేదు అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

ఈఏడాది చిరంజీవి ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. మొదట ఆచార్య సినిమాను రిలీజ్ చేయగా అది బాక్సాఫీస్ వద్ద అంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ సినిమా మాత్రం సూపర్ హిట్ అందించింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ లో ఉన్నారు. ప్రస్తుతం చిరు బాబి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను వాల్తేరు వీరయ్య గా ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈసినిమాను బాబి మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నాడు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.